Asianet News TeluguAsianet News Telugu

భారత్ కే తలమానికమైన మొతేరా క్రికెట్ స్టేడియం గురించిన పూర్తి వివరాలు

భారత్‌ ఇంగ్లాండ్‌ల మధ్య టెస్టు సిరీస్‌లోని మూడు, నాలుగు మ్యాచ్‌లు అహమ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరగనున్నాయి.

First Published Jan 30, 2021, 7:04 PM IST | Last Updated Jan 30, 2021, 7:04 PM IST

భారత్‌ ఇంగ్లాండ్‌ల మధ్య టెస్టు సిరీస్‌లోని మూడు, నాలుగు మ్యాచ్‌లు అహమ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరగనున్నాయి. ఫిబ్రవరి 24, మార్చి 4న మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. మోతేరాకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంతో పాటు మరో ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ 11 మల్టిపుల్‌ పిచ్‌లు ఉన్నాయి. మోటెరోలో 11 పిచ్‌లు ఉంటే, ఐదు పిచ్‌ల నిర్మాణంలో ఎర్రమట్టిని వినియోగించామనీ, మిగతా ఆరు పిచ్‌లు నల్లమట్టిని వాడినట్టు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ అనిల్‌ పటేల్‌ తెలిపారు. ఈ క్రీడామైదానంలో రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్లు ఉన్నాయి. ఈ రెండింటిలో చెరో తొమ్మిది మల్టిపుల్‌ పిచ్‌లు ఉన్నాయి. వీటిలో ఐదుపిచ్‌లు ఎర్రమట్టి, నాలుగు నల్లమట్టితో తయారుచేశామన్నారు. ఈ తరహా వెరైటీ పిచ్‌లు ప్రపంచంలో ఎక్కడాలేవని తెలిపారు.