భోగి నాడు రేగిపండ్లను చిన్న పిల్లలపై ఎందుకు పోస్తరో తెలుసా...?
భోగి పండగ రోజున గోచార గ్రహస్థీతిలో ఉన్న అన్ని చెడు కర్మలు తొలగాలి భోగి మంటవేస్తారు.
భోగి పండగ రోజున గోచార గ్రహస్థీతిలో ఉన్న అన్ని చెడు కర్మలు తొలగాలి భోగి మంటవేస్తారు. ఆ బోగి నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుడి ముందు పెడతారు, ఇది ఒక సాంప్రదాయం దాంతో పాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు, పిల్లలకు ఐదు సంవత్సరాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు పోస్తారు. ఆ వయస్సులో పిల్లలకు బ్రహ్మ రంధ్రం పలుచగా ఉంటుంది రేఖి అరా కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పండ్లుకి రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లల తల పైన బ్రహ్మ రంధ్రానికి శక్తిని ఇస్తుంది, మేధస్సుకి శక్తి వస్తుంది.