గుంతలు, బురద నిండిన రోడ్లో పొర్లు దండాలు.. ఓ యువకుడి వినూత్న నిరసన...
వైఎస్సార్ జిల్లా : తమ గ్రామానికి వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి పొర్లు దండాలతో నిరసన చేపట్టాడు.
వైఎస్సార్ జిల్లా : తమ గ్రామానికి వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి పొర్లు దండాలతో నిరసన చేపట్టాడు. జగనన్న రోడ్డు వేయాలంటూ స్లోగన్స్ ఇస్తూ పొర్లు దండాలు పెట్టాడు. తమ ఊరు 40యేళ్లుగా ఉందని... అయితే వర్షం పడితే నరకంగా మారుతుందని.. వార్డు సభ్యుడైన రాజేష్ ఇలా వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ వీడియో షేర్ చేశారు.