Asianet News TeluguAsianet News Telugu

మాండూస్ తుపాను ఎఫెక్ట్... నీటమునిగిన పంటలు పరిశీలించిన ఎంపీ, కలెక్టర్

అమరావతి : మాండూస్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు వైసిపి ప్రభుత్వం అండగా వుంటుందని ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.

First Published Dec 14, 2022, 12:23 PM IST | Last Updated Dec 14, 2022, 12:23 PM IST

అమరావతి : మాండూస్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు వైసిపి ప్రభుత్వం అండగా వుంటుందని ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ముఖ్యంగా చేతికందివచ్చిన వరి పంట అకాల వర్షాలతో నీటమునగడం బాధాకరమని ఎంపీ అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించడంతో వరి సాగు బాగా జరిగిందని... అంతా బాగుందనుకునే సమయంలో మాండూస్ తుపాను రైతులకు కన్నీరు మిగిలించిందని అన్నారు.  బాపట్ల జిల్లా చెరుకుపల్లి, నగరం మండలాలలో నీట మునిగిన పంట పొలాలను ఎంపీ మోపిదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు అధైర్య పడొద్దని... ప్రభుత్వం అండగా వుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు. ఇక కృష్ణా జిల్లాలోనూ మాండూస్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులకు నష్టాలను మిగిల్చాయి. ఇలా చల్లపల్లి మండలం మాజెరు గ్రామ పరిధిలో మునకకు గురయిన పంట పొలాలను కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు.