Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఆర్థిక పరిస్ధితి దిగజారడానికి... కారకుడు ఆయనే..: వైసిపి ఎంపీ సంచలనం

గుంటూరు: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించమని మంత్రుల కమిటీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతోనే పీఆర్సీ సమస్య పరిష్కారం అయ్యిందని వైసిపి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులే అయిన ఉద్యోగులు కొంత సంయమనం పాటిస్తే బాగుండేదన్నారు. మొదటి నుంచి కొన్ని సంప్రదింపులు జరిగితే బాగుండేదన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఆర్ధిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని... కోవిడ్ వల్ల ఆర్ధికంగా మరింత ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అన్ని సంక్షేమ పధకాలు ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. 
 
Video Top Stories