మ్యానిఫెస్టోతో కాదు మార్ఫింగ్ వీడియోలతో టిడిపి రాజకీయం..: మాధవ్ కు మంత్రి రోజా మద్దతు

అమరావతి :  వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై జరుగుతున్న వివాదంపై మంత్రి రోజా మరోసారి స్పందిస్తూ ప్రతిపక్ష టిడిపిపై ఫైర్ అయ్యారు.

First Published Aug 11, 2022, 11:08 AM IST | Last Updated Aug 11, 2022, 11:08 AM IST

అమరావతి :  వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై జరుగుతున్న వివాదంపై మంత్రి రోజా మరోసారి స్పందిస్తూ ప్రతిపక్ష టిడిపిపై ఫైర్ అయ్యారు. మాధవ్ ది మార్పింగ్ వీడియో అని తేలడంతో తెలుగు దేశం పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయన్నారు. ఇలాంటి అసభ్య వీడియోలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని...  ఇందంతా లోకేష్ నడిపించే ఐ టిడిపి అంటే తప్పుడు ప్రచార విభాగం పనేనని ఆరోపించారు. మార్ఫింగ్ వీడియో ద్వారా తమ పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారని... మ్యానిఫెస్టొతో కాకుండా మార్పింగ్ వీడియోలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని మంత్రి ఎద్దేవా చేసారు. జగన్ లాంటి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా వుండటం మన అదృష్టమని రోజా అన్నారు. ఆయనను మహిళలు సొంత అన్న, తమ్ముడి లా ఆదరిస్తుండటంతో టిడిపికి నచ్చడంలేదని... అందువల్లే కుట్రలు పన్నుతోందన్నారు. టిడిపి హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా అమాయక మహిళలను వ్యభిచార కూపంలోకి లాగిన బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్ ను ఎందుకు సస్పెండ్ చేయించలేదంటూ టిడిపి నాయకురాలు అనితను ప్రశ్నించారు. జగన్ మహిళా పక్షపాతి, తన కుటుంబంలోని మహిళలను ఎంత గౌరవిస్తారో రాష్ట్రంలోని మహిళలందరినీ గౌరవిస్తారన్నారు. కాబట్టి ఇలాంటి మార్పింగ్ వీడియోలతో పిచ్చి పనులు మానుకోవాలని... లేదంటే తగిన బుద్ది చెబుతామని మంత్రి రోజా హెచ్చరించారు.