అప్పుడు గేలి చేశారు.. ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది.. ఉండవల్లి శ్రీదేవి..
గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడిపురంలో బెజ్జం సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేతులమీదుగా సుమారు160 మంది పేదలకు 25 కిలోల బియ్యం అరు రకాల కూరాయలతో కూడిన కిట్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ నియోకవర్గస్థాయిలో ముందుగా పేదలకు సహాయం చేయడం మంచి పరిణామం అన్నారు. హరినాథ్ చౌదరి గారి సహకారంతో అంబులెన్స్ కూడా అందుబాటులోకి వచ్చిందని అవసరమైనవాళ్లు ఉపయోగించు కోవచ్చన్నారు.