Asianet News TeluguAsianet News Telugu

హోటల్లో పునుగులు వేసుకుంటున్న వైసిపి మహిళా ఎమ్మెల్యే... ఎవరో గుర్తుపట్టారా?

గుంటూరు : వర్షంలో వేడి వేడి బజ్జీలు, పునుగులు తింటే ఆ మజాయే వేరు. అయితే ఈ పునుగులు ఎమ్మెల్యే వేసినవి అయివుంటే...

గుంటూరు : వర్షంలో వేడి వేడి బజ్జీలు, పునుగులు తింటే ఆ మజాయే వేరు. అయితే ఈ పునుగులు ఎమ్మెల్యే వేసినవి అయివుంటే... ఆ అదృష్టం గుంటూరు ప్రజలకు దక్కింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మేడికొండూరు మండలం పేరేచర్లలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఓ టిఫిన్ సెంటర్ వద్ద మహిళలను పలకరించిన ఎమ్మెల్యే చూపు పునుగులపై పడింది. ఇంకేముందు ఎమ్మెల్యే స్వయంగా పునుగులు వేసి అందరికీ తినిపించారు. ఎమ్మెల్యే వేసిన వేడివేడి గుంట పునుగులను అక్కడున్నవారి లొట్టలేసుకుంటూ ఆరంగించారు.