Asianet News TeluguAsianet News Telugu

నాతో పెట్టుకుంటే... మూతి మీద మీసం లేని ఆ టిడిపి నాయకుడి మూతి పగులుద్ది..: రోజా స్ట్రాంగ్ వార్నింగ్

నగరి: తెలుగుదేశం పార్టీ నగరి నియోజకవర్గ ఇంచార్జి గాలి భానుప్రకాష్ పై వైసిపి ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. మూతి మీద మీసం లేని టీడీపీ నాయకుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు... ఇప్పటివరకు వాటిని పట్టించుకోలేదు కానీ ఇకపై బూతులతో సమాధానం చెప్పాల్సి వుంటుందని హెచ్చరించారు. అక్రమంగా సంపాదిస్తున్నానని తన గురించిమాట్లాడితే మూతి పగిలిపోతుందని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగి డబ్బు గడించాను తప్ప రాజకీయంగా ఏమి సంపాదించలేదన్నారు. ''సొంత తండ్రినే చంపాడని భానుప్రకాష్ గురించి అతడి తల్లి, సోదరుడే ఆరోపించారు... ఇలా ఇంటిని చక్కదిద్దుకోలేని వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నాడు. వైసిపిలో ఉంటూనే నా వెన్నుపోటుదారులు, నన్ను వ్యతిరేకించే వారి అండదండలతో గెలవాలనుకుంటే ఆ నాయకుడికి పగటి కలే అవుతుంది'' అని రోజా మండిపడ్డారు. 

Video Top Stories