నీటిపారుదల అధికారులపై మాజీ హోంమంత్రి సుచరిత సీరియస్...
గుంటూరు : నీటి పారుదల అధికారులపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
గుంటూరు : నీటి పారుదల అధికారులపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అప్పాపురం చానల్ ద్వారా 30వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి వుండగా అధికారుల నిర్లక్ష్యంతో సగానికి పైగా పొలాలకు నీరు అందడం లేదని రైతులు మాజీ మంత్రికి తెలిపారు. సీజన్ ప్రారంభం నాటికి కాలువల్లో పూడిక తీయకపోవడంవల్లే నీరు పారడంలేదని... కాంట్రాక్టర్లతో కుమ్మకయినా అధికారుల తీరువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. దీంతో కాకుమానులో నీటి పారుదల శాఖ అధికారులతో సుచరిత సమావేశమైన మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఇప్పటికైనా పంథా మార్చుకోవాలని హెచ్చరించారు.