Asianet News TeluguAsianet News Telugu

వంగవీటి రంగాను చంపేందుకే వాళ్లు టిడిపిలోకి..: కొడాలి నాని సంచలనం

విజయవాడ : కేవలం విజయవాడలోనే కాదు ఏపీ రాజకీయాలను దివంగత వంగవీటి మోహనరంగా శాసించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

First Published Dec 26, 2022, 11:37 AM IST | Last Updated Dec 26, 2022, 11:37 AM IST

విజయవాడ : కేవలం విజయవాడలోనే కాదు ఏపీ రాజకీయాలను దివంగత వంగవీటి మోహనరంగా శాసించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకున్ని కుట్రలు పన్ని హత్య చేసారని... ఇందుకోసమే ఆయన శత్రువులు 1983లో  టిడిపిలో చేరారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే రంగాను చంపిన దుర్మార్గులు ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో వున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే నాని అన్నారు. 

విజయవాడ రూరల్ మండలం నున్నలో వంగవీటి మోహనరంగా కాంస్య విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.