పకోడీల స్వామి పవన్ కు చంద్రబాబు చెకోడీల భక్తుడు...: కొడాలి నాని ఎద్దేవా
విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్... అలాంటి ఆయన కూడా ఆత్మాభిమానం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చిరంజీవిని సోదరుడిగా భావించాడు కాబట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి సీఎం జగన్ మాట్లాడారన్నారు. కానీ పవన్ మాత్రం సొంత సోదరుడు చిరంజీవికి ఆత్మాభిమానం లేదంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు వంగి వంగి నమస్కారం చేసి బూట్లు నాకే పవన్ కళ్యాణ్ కు అసలు ఆత్మాభిమానం అంటే ఏంటో తెలుసా? అంటూ మాజీ మంత్రి మండిపడ్డారు.
పకోడి స్వామి అయిన పవన్ కళ్యాణ్ కు చెకోడీ భక్తుడైన చంద్రబాబు ప్యాకేజీల నైవేద్యం సమర్పిస్తున్నాడంటూ ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేసారు. సొంతపుత్రుడు వల్ల ప్రయోజనం లేకపోవడంతో చంద్రబాబు దత్తపుత్రుడి భజన చేస్తున్నాడన్నారు. చంద్రబాబు అండ్ కో, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ కు , జగన్మోహన్ రెడ్డితో పోలికేంటి?
లోకేష్ స్థాయి తెలుసుకొని ప్రవర్తించాలని కొడాలి నాని హెచ్చరించారు.