జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ... బిజెపి రాజకీయ వ్యూహంలో భాగమే..: మాజీ మంత్రి నాని సంచలనం

విజయవాడ : కేంద్రం హోంమంత్రి అమిత్ షా, నందమూరి కుటుంబానికి చెందిన యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు.

First Published Aug 22, 2022, 2:45 PM IST | Last Updated Aug 22, 2022, 2:45 PM IST

విజయవాడ : కేంద్రం హోంమంత్రి అమిత్ షా, నందమూరి కుటుంబానికి చెందిన యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగమే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి విస్తరణకు ఉపయోగపడుతుందనే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని అధికారం తేవాలన్నదే మోదీ, అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారని... ఈ క్రమంలోనే జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ జరిగిందన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం జరిగిందని నాని పేర్కొన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్ 25కు పైగా తెలుగు సినిమాలలో నటించారు... ఆయన నటన గురించి అందరికీ తెలుసన్నారు. హిందీలో కూడా ఎన్టీఆర్ సినిమాలు డబ్ అవుతుంటాయి కాబట్టి వాటిలో చాలావరకు అమిత్ షా చూసివుంటారని మాజీ మంత్రి అన్నారు. అలాంటిది ఇప్పుడే ఆయనను నటనను అమిత్ షా గుర్తించినట్లు తాను భావించడం లేదని... రాజకీయాల కోసమే జూ. ఎన్టిఆర్ ను కలిసారని అన్నారు. కేవలం ఒక సినిమాలో యాక్షన్ బావుందని జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని తాను అనుకోవడం లేదని మాజీ మంత్రి నాని పేర్కొన్నారు.