Asianet News TeluguAsianet News Telugu

భారతమ్మ గురించి మాట్లాడితే చంద్రబాబు కుటుంబం బ్రతుకు బయటపెడతా: కొడాలి నాని

గుడివాడ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

First Published Sep 9, 2022, 12:30 PM IST | Last Updated Sep 9, 2022, 2:36 PM IST

గుడివాడ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంగురించి ఎక్కువతక్కువ మాట్లాడితే చంద్రబాబు కుటుంబం బ్రతుకు బయటపెడతానంటూ హెచ్చరించారు. ముఖ్యంగా వైఎస్ భారతమ్మ గురించి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని లోకేష్ కు కొడాలి నాని హెచ్చరించారు. 

కృష్ణా జిల్లాలోని తన సొంత నియోజకవర్గం గుడివాడలో కొడాలి నాని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలినడకన 34 వార్డులో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే తాము తలచుకుంటే తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ ను ఇంటికి వెళ్లి కొడతామని ఎమ్మెల్యే నాని హెచ్చరించారు.