కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న వైసిపి ఎమ్మెల్యే కారు... తృటితో తప్పిన ప్రమాదం

ఏలూరు : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలీజాతో పాటు ఆయన కుటుంబం తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

First Published Dec 20, 2022, 10:17 AM IST | Last Updated Dec 20, 2022, 10:17 AM IST

ఏలూరు : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలీజాతో పాటు ఆయన కుటుంబం తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఎమ్మెల్యే కుటుంబం ప్రయాణిస్తున్న కారు కామవరపుకోట మండలం అడమిల్లి వద్ద ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కరెంట్ స్తంభానికి ఢీకొట్టింది. అయితే వెంటనే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే ఎలిజాతో పాటు కుటుంబసభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు. కరెంట్ తీగలు తెగి కారుపై పడినా పెను ప్రమాదం జరిగేదని... అదృష్టవశాత్తు అలా జరక్కపోవడంతో ఎమ్మెల్యే ఫ్యామిలీ సేఫ్ గా బయటపడ్డారు.  ఎమ్మెల్యే ఎలిజా కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుండి స్వస్థలం జంగారెడ్డి గూడెంకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రంతా కారు నడిపిన డ్రైవర్ తెల్లవారుజామున నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే ఎలిజా మరో కారును తెప్పించుకుని కుటుంబంతో కలిసి  జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.