ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బామ్మర్ది వీరంగం... పోలీసుల ఎదుటే సూసైడ్ అటెంప్ట్
తిరుపతి : అధికార వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బామ్మర్ది సామాను శ్రీధర్ రెడ్డి వీరంగం సృష్టించాడు.
తిరుపతి : అధికార వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బామ్మర్ది సామాను శ్రీధర్ రెడ్డి వీరంగం సృష్టించాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ కు బామ్మర్దితో చాలాకాలంగా విబేధాలు కొనసాగుతూ తాజాగా తారాస్థాయికి చేరుకున్నారు. ఓ భూమి విషయంలో బావా బామ్మర్ది వివాదం రచ్చకెక్కి చివరకు పోలీసుల ఎదుటే శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు యత్నించే స్థాయికి చేరింది. పోలీసులపై చిందులు తొక్కుతూ నానా హంగామా సృష్టించిన శ్రీధర్ స్వయంగా తనను తానే గాయపర్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.