వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడమే కాదు ఆ కోరికలూ తీరాలి..: రొట్టెల పండగలో ఎమ్మెల్యే అనిల్ ప్రార్థన

నెల్లూరు : కులమతాలకు అతీతంగా నెల్లూరులో జరిగే రొట్టెల పండగలో మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెత్తిన టోపి, మెడపై శాలువాతో పక్కా ముస్లీం వేషధారణలో బారాషహీద్ దర్గాకు చేరుకున్న అనిల్ గతంలో తాను వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ కోరగా అది నెరవేరిందన్నారు. ఈ మొక్కుతీర్చుకోడానికి రొట్టెల పండగలో పాల్గొన్నట్లు తెలిపారు. వైసిపి నాయకులు, దర్గా ప్రతినిధులతో కలిసి అనిల్ యాదవ్ స్వర్ణాలు చెరువులో రొట్టెలు విడిచి మొక్కు చెల్లించుకున్నారు. 

First Published Aug 12, 2022, 4:04 PM IST | Last Updated Aug 12, 2022, 4:21 PM IST

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ... ఈసారి మరో మూడు కోరికలు కోరుకున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్   రెండవసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని, రాష్ట్ర సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని,  జర్నలిస్టులు తమ వృత్తిలో రాణించాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకున్నానని అన్నారు. ఈ కోరికలు తీరితే మరోసారి స్వర్ణ చెరువులో రొట్టెలు విడిచిపెడతానని ఎమ్మెల్యే అనిల్ తెలిపారు.