అమరావతి రాజధానిగానే వుంటుంది... మేమెప్పుడూ కాదనలేదే..: వైసిపి ఎమ్మెల్యే అనిల్

నెల్లూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

First Published Oct 6, 2022, 5:12 PM IST | Last Updated Oct 6, 2022, 5:12 PM IST

నెల్లూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మూడు రాజధానులు పెట్టి అటు కోస్తాంద్ర తో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ లను అభివృద్ది చేయాలన్నదే సీఎం ఆలోచన అన్నారు.  గతంలో ఒకే ప్రాంతాన్ని అభివృద్ది చేసుకున్నాం... దీంతో ప్రజల మధ్య విద్వేషాల చెలరేగి చివరకు దాన్ని కోల్పోయామని గుర్తుచేసారు. కాబట్టే ఒకే చోట అభివృద్దిని కేంద్రీకరించడం కాకుండా వికేంద్రీకరణ చేపట్టాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనిల్ యాదవ్ పేర్కొన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు అమ్మవారి ఆశిస్సులతో మంచి జరగాలని అనిల్ యాదవ్ కోరుకున్నారు. అమరావతి నుండి రాజధాని మారుస్తామని వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని... దీంతో పాటుగానే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ది చేస్తామంటున్నామని అన్నారు. టిడిపి రాష్ట్రానికి ప్రతిపక్షమా లేక కేవలం అమరావతి ప్రాంతానికేనా అంటూ ప్రశ్నించారు. కేవలం అమరావతి ప్రాంతంలోనే బినామీల కోసమే టిడిపి పనిచేస్తోందని అనిల్ ఆరోపించారు.