నేను పోటీ చేయకున్నా... మంగళగిరిలో వైసిపిదే విజయం : ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్ఢినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరుకాకపోవడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్ఢినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరుకాకపోవడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్, వైసిపి పార్టీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని... ఇది ప్రతిపక్ష టిడిపి ప్రచారమైనని అన్నారు. తనకు ఇటీవలే పంటి సర్జరీ కావడం, ఇటీవలే కొడుకు పెళ్లి కావడం వల్ల హైదరాబాద్ లో వుండిపోయానని... అందువల్లే సీఎం మీటింగ్ కి హాజరు కాలేదని అన్నారు. ఇది అదునుగా చూసుకొని ఇష్టం వచ్చినట్టు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. రాజకీయాల్లో ఉంటే జగనన్నతోనే ఉంటాను లేకుంటే తన పొలంలో పనిచేసుకుంటానని ఎప్పుడో అసెంబ్లి సాక్షిగా చెప్పాను.... ఇప్పుడు అదే చెబుతున్నానని ఆర్కే అన్నారు.
మంగళగిరి ఆర్కే పోటీ అనేది జగన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. పరిస్థితులను బట్టి మార్పు జరిగితే జరగొచ్చని.. లేకపోతే తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.