కాడెద్దులా మారి కాయకష్టం చేస్తున్న వైసిపి ఎమ్మెల్యే... ఎవరో గుర్తుపట్టారా...?
మంగళగిరి : అతడు విలక్షణ రాజకీయ నాయకుడు. నిత్యం ప్రజాసేవలో వుంటూ మంచి రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్న ఆయన అంతకంటే మంచి రైతు కూడా.
మంగళగిరి : అతడు విలక్షణ రాజకీయ నాయకుడు. నిత్యం ప్రజాసేవలో వుంటూ మంచి రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్న ఆయన అంతకంటే మంచి రైతు కూడా. కోట్ల ఆస్తులు, ఎమ్మెల్యే పదవి, అధికార పార్టీ అండదండలు, వ్యాపారాలు... ఇలా ఎన్నివున్నా నేలతల్లిని మరిచిపోలేదు. వీలుచిక్కినప్పుడల్లా కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేస్తుంటాడు ఎమ్మెల్యే. కేవలం ఫోటోలకు ఫోజులివ్వడం కాకుండా నిజంగానే ఒళ్లువంచి వ్యవసాయపనులు చేస్తుంటాడు. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు... ఆళ్ల రామకృష్ణారెడ్డి.
తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో అందరు రైతుల మాదిరిగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఫిరంగిపురం మండలం వేమవరంలోని తన పొలంలో వరిపంట వేయడానికి భూమిని స్వయంగా సిద్దం చేస్తున్నారు. దుక్కిదున్ని వరిమళ్ళను సిద్దంచేసి ఎరువులు, నారుమడి విత్తనాలు జల్లడం వంటివి దగ్గరుండి చూసుకుంటున్నారు ఆళ్ల. తమతో కలిసే వ్యవసాయ పనులు చేస్తున్న ఆళ్లను చూసి ఎమ్మెల్యే అంటే ఇంత సాధాసీదాగా వుంటారా అని కూలీలు ఆశ్చర్యపోతున్నారు.