స్పీడ్ పెంచిన నారా లోకేష్... మంగళగిరిలో వైసిపి షాక్
తాడేపల్లి : గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి,
తాడేపల్లి : గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈసారి అలా జరక్కుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరికి చెందిన అధికార వైసిపి నాయకులను టిడిపిలోకి చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి నేత గొర్ల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు చాలామంది టిడిపిలో చేరారు. వారికి పసుపుకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్. ఈ చేరిక కార్యక్రమం కోసం మంగళగిరికి విచ్చేసిన లోకేష్ కు టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అలాగే వేణుగోపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులకు పార్టీ కండువా కప్పే సమయంలో హాల్ మొత్తం జై లోకేష్... జై తెలుగుదేశం నినాదాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా అందరూ కలిసి రండి... దారితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెడదాం అంటూ లోకేష్ పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ముందు ప్యాలస్ పిల్లి మియావ్ మియావ్ అందంటూ లోకేష్ ఎద్దేవా చేసారు.