Asianet News TeluguAsianet News Telugu

గెలిపించిన ప్రజలకోసం... పారిశుధ్ద్య కార్మికుడి అవతారమెత్తిన వైసిపి కౌన్సిలర్

విజయవాడ : మున్సిపల్ అధికారులు, సిబ్బంది చుట్టూ తిరిగి విసిగిపోయిన వార్డు కౌన్సిలర్ తనను గెలిపించిన ప్రజల కోసం పారిశుద్ద్య కార్మికుడి అవతారమెత్తాడు. 

First Published Dec 2, 2022, 1:57 PM IST | Last Updated Dec 2, 2022, 1:57 PM IST

విజయవాడ : మున్సిపల్ అధికారులు, సిబ్బంది చుట్టూ తిరిగి విసిగిపోయిన వార్డు కౌన్సిలర్ తనను గెలిపించిన ప్రజల కోసం పారిశుద్ద్య కార్మికుడి అవతారమెత్తాడు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన ఒకటవ వార్డులో దోమలబెడద ఎక్కువగా వుండటంతో స్థానిక వైసిపి కౌన్సిలర్ చంద్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మున్సిపల్ కమీషనర్ తో పాటు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోవడంతో కౌన్సిలరే స్వయంగా పారిశుద్ద్య కార్మికుడిగా మారాడు. వార్డులో తిరుగుతూ దోమలమందును పిచికారీ చేసాడు కౌన్సిలర్ చంద్రం. మున్సిపల్ కమీషనర్ తీరుతో విసిగిపోయి ఈ పని చేస్తున్నానని... ఇలాంటి కమీషనర్ మా పట్టణానికి రావడం ఖర్మ అని కౌన్సిలర్ చంద్రం మండిపడ్డాడు.