Asianet News TeluguAsianet News Telugu

తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత... వైసిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

First Published Apr 24, 2023, 2:46 PM IST | Last Updated Apr 24, 2023, 2:46 PM IST

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎవరి హయాంలో తిరువూరు అభివృద్ది జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమా అంటూ ఇరుపార్టీల నాయకులు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రెండు పార్టీల నేతలు స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద సిద్దమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు ర్యాలీగా బయలుదేరిన  వైసిపి నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అంతకుముందే టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరువూరులో భారీగా పోలీసులు మోహరించారు.