ఆడపిల్లగా పుడితే మీరు పాలించే ఏపీలోనే పుట్టాలి..: జగన్ తో మహిళ
విశాఖపట్నం: మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్రలో భాగంగా క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.248.47 కోట్లు జమ చేసిన సీఎం చేశారు సీఎం వైఎస్ జగన్.
విశాఖపట్నం: మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్రలో భాగంగా క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.248.47 కోట్లు జమ చేసిన సీఎం చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోని లబ్దిదారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ''పుడితే ఆడపిల్ల గానే పుట్టాలి... అదికూడా జగనన్న నాయకత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ లోనే పుట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
నాకు ఒక అన్న వున్నా ఇంత చేయడు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి. జగనన్న నాయకత్వంలో పెరగాలి. అన్న లేడని ఎంతో బాధపడుతున్నా. ఇలాంటి సమయంలో మీరు అండగా నిలిచారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా మీకు రుణపడి వుంటుంది'' అని మహిళ తెలిపింది.