మంగళగిరిలో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన శ్రీలక్ష్మి...

మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో కోటి 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను ఇవాళ ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ప్రారంభించారు. 

First Published Dec 14, 2022, 5:19 PM IST | Last Updated Dec 14, 2022, 5:19 PM IST

మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో కోటి 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను ఇవాళ ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటికే 95% అర్బన్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం పూర్తయ్యిందని... రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లగురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టిడ్కో గృహాలలో మౌళిక సదుపాయాల లోపం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఆయా మున్సిపాలిటీల ద్వారా ఈ లోపాలు సరిదిద్దుతామని శ్రీలక్ష్మి భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల 62 వేల టిడ్కో గృహాల నిర్మాణం జరిగిందని...లక్షా 50 వేల గృహాలు లబ్ధిదారులకు స్వాధీనం చేయడం జరిగిందని శ్రీలక్ష్మి వెల్లడించారు.