ఉదయం అలక... మధ్యాహ్నానికి బాలినేని వేలు పట్టుకొని బటన్ నొక్కించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. మర్కాపురంలో నిర్వహించిన కార్యక్రమాంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు.అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసేందుకు ల్యాప్ ట్యాప్‌లో బటన్ నొక్కుతున్న సమయంలో సీఎం జగన్.. తనకు సమీపంలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని చేతిని పట్టుకుని ఆయన చేత బటన్ నొక్కించారు. అలాగే మహిళకు చెక్కు అందజేస్తున్న సమయంలో కూడా బాలినేని చేయి పట్టి తన దగ్గరకు లాగారు.