Asianet News TeluguAsianet News Telugu

కరోనా థర్డ్ వేవ్ విజృంభణ వేళ.. దాచేపల్లిలో వైసిపి కార్యాలయ ప్రారంభోత్సవం ఇలా...

దాచేపల్లి: కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

దాచేపల్లి: కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇవాళ(బుధవారం) ధాచేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కరోనా కారణంగా ఉద్యోగుల నిరసనలకు అనుమతివ్వడం లేదంటున్న పోలీసులకు స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చేపడుతున్న ఇలాంటి ర్యాలీలు కనిపించవా? అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నారు.