Asianet News TeluguAsianet News Telugu

జగనన్న కష్టమే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ: ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి.

గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జెండాని ఆవిష్కరించి వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచారు. 

పదేళ్ళ క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని...ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అధికారంలో వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసిన జగన్ అధికారంలోకి రాగానే పేదప్రజల కష్టాలను తీర్చారని పేర్కొన్నారు. సీఎం జగనన్న కష్టమే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అని 
శ్రీదేవి పేర్కొన్నారు.