Asianet News TeluguAsianet News Telugu

బెల్టుషాపులపై సీఎం కొరడా..గ్రామాల్లో ఉండడానికి వీల్లేదు...

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమరవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌. 

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమరవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి చేపడుతున్న కార్యక్రమాలను బెల్టుషాపులు, ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణాలు దెబ్బతీస్తాయని జగన్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి జరగకుండా చూడాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని తదితర అధికారులు పాల్గొన్నారు. 

Video Top Stories