Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రిలో 500పడకల కోవిడ్ హాస్పిటల్... ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని సీఎం జగన్‌ ప్రారంభించారు. 

First Published Jun 4, 2021, 5:08 PM IST | Last Updated Jun 4, 2021, 5:08 PM IST

అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని సీఎం జగన్‌ ప్రారంభించారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ గా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు క్యాంప్‌ కార్యాలయం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.