పెన్నానదిలో కొట్టుకుపోతున్న ద్విచక్రవాహనం.. చాకచక్యంగా కాపాడిన యువకులు...
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజక వర్గం కంబదూరు మండలంలోని నూతిమడుగు గ్రామ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజక వర్గం కంబదూరు మండలంలోని నూతిమడుగు గ్రామ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వంతెనపై వెళ్లుతున్న పెన్నానది పరివాహక వరదనీటిలో కొట్టుకుని వెళ్తున్న ద్విచక్ర వాహానాన్ని యువకులు పగ్గాలతో బయటికి లాగారు. వరద పొంగి పొర్లుతున్న అధికారులు హెచ్చరికలు జారీ చేసినా.. వాటిని బేఖాతరు చేస్తూ వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. కాస్త ఏమరుపాటుగా ఉంటే.. వాహనంతో పాటు దానిమీద ప్రయాణిస్తున్నవారు కూడా గల్లంతయ్యేవారు.