Asianet News TeluguAsianet News Telugu

అన్న క్యాంటీన్ కు నిప్పంటించిన దుండగులు... తెనాలిలో ఉద్రిక్తత

గుంటూరు : గత టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు వైసిపి అధికారంలో రాగానే మూతపడ్డ విషయం తెలిసిందే.

First Published Dec 18, 2022, 11:07 AM IST | Last Updated Dec 18, 2022, 11:07 AM IST

గుంటూరు : గత టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు వైసిపి అధికారంలో రాగానే మూతపడ్డ విషయం తెలిసిందే. ఇలా గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మూతపడ్డ అన్న క్యాంటీన్ కు తాజాగా గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. అర్ధరాత్రి క్యాంటీన్ వద్దకు చేరుకున్న దుండగులు తలుపులకు నిప్పంటించి పరారయ్యారు.  ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.  

అన్న క్యాంటిన్ కు నిప్పంటించిన విషయం తెలిసి టిడిపి శ్రేణులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.  పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘాతుకం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది.