Asianet News TeluguAsianet News Telugu

ఇదేంటని ప్రశ్నిస్తే ఇలాగా... నడిరోడ్డులో యువతిపై పోలీసుల జులుం


విశాఖపట్నం: కర్ఫ్యూ సమయంలో అన్ని అనుమతులతో రోడ్డుపైకి వచ్చిన ఓ యువతిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

First Published Jun 6, 2021, 11:03 AM IST | Last Updated Jun 6, 2021, 11:03 AM IST


విశాఖపట్నం: కర్ఫ్యూ సమయంలో అన్ని అనుమతులతో రోడ్డుపైకి వచ్చిన ఓ యువతిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తాను అపోలో పార్మసీ లో పనిచేస్తానని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులు తనతో దారుణంగా వ్యవహరించారని మహిళ రోడ్డుపైనే ఆందోళనకు దిగింది. తనతో పాటు వాహనానికి అనుమతి వున్నా పోలీసులు ఇలా జులుం ప్రదర్శించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

ఏ తప్పు చేయకుండా పోలీసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారని మహిళ తెలిపారు. బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించాలని చూస్తున్నారని... నన్ను ఇక్కడే చంపేయండి... నేను స్టేషన్ కు రాను అంటూ మహిళా ఉద్యోగి ఆందోళరకు దిగింది. ఈ క్రమంలోనే పోలీసులకు, యువతికి మధ్య తోపులాట జరిగింది.