విశాఖజిల్లా లో యువకుడు ఆత్మహత్య
Nov 6, 2020, 12:23 PM IST
పెదగంట్యాడ మండలం యాతపాలెం భూలోకమాంబ గుడిదగ్గర జీడి మామిడితోటలో కంబిడి ఆదిత్య ( 20) ఉరేసుకొనీ ఆత్మహత్య చేసుకొన్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈయన మార్చి నెలలో ప్రేమ వివాహం చేసుకునీ కుటుంబం తో సంతోషం గా గడిపేవాడని తెలిపారు. న్యూ పోర్టు పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖలోనీ కేజీహెచ్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.