శారీరకంగా వాడుకుని మోసం.. పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆందోళన

ప్రేమిస్తున్నానని వెంటపడి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగింది.

First Published Jan 24, 2021, 3:51 PM IST | Last Updated Jan 24, 2021, 3:51 PM IST

ప్రేమిస్తున్నానని వెంటపడి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని... అప్పటివరకు పోలీస్ స్టేషన్ లొనే ఉంటానని భీష్మించుకుని కూర్చుంది.

 వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కి చెందిన యువతి ఏలూరులో బిటెక్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన తమిరి సాయిచైతన్య నాలుగు సంవత్సరాలు నుండి ప్రేమిస్తున్నానంటూ శారీరకంగా వాడుకున్నాడని... పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇప్పుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనని ప్రేమించాననే విషయం ఎవరికైనా చెప్పినా, ఫోటోలు ఎవరికైనా చూపించినా నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. యువతి  ఫిర్యాదుతో కేసు నమోదు  చేసుకున్నారు పోలీసులు.