Asianet News TeluguAsianet News Telugu

తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు చూడలేక... నందిగామలో యువతి ఆత్మహత్య

విజయవాడ : బ్యాంక్ సిబ్బంది వేధింపులు భరించలేక మనస్థానంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

First Published Jul 28, 2022, 4:42 PM IST | Last Updated Jul 28, 2022, 4:42 PM IST

విజయవాడ : బ్యాంక్ సిబ్బంది వేధింపులు భరించలేక మనస్థానంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామ రైతుపేటలో నివాసముంండే జాస్తి ప్రభాకరరావు-అరుణ దంపతులకు హరిత వర్షిణి సంతానం. ఈ దంపతులు కుటుంబ అవసరాల కోసం రెండేళ్లక్రితం ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా మూడులక్షల యాబైవేల రూపాయల లోన్ తీసుకున్నారు. అయితే ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఇప్పటివరకు ఆ లోన్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ రికవరీ సిబ్బంది ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారు. నిన్న (బుధవారం) కూడా ఇలాగే అరుణకు బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసి లోన్ కట్టాలని అడిగారు. అయితే ఇలా తల్లిదండ్రులకు బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేయడాన్ని అవమానంగా భావించిన హరిత వర్షిణి దారుణ నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్  కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.