Andhra News: సర్ ప్రైజ్ గిప్ట్ ఇస్తానంటూ... కత్తితో కాబోయే భర్త గొంతుకోసిన యువతి
అనకాపల్లి: తనకు ఇష్టంలేకున్నా తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది.
అనకాపల్లి: తనకు ఇష్టంలేకున్నా తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ఏకాంతంగా మాట్లాడుకుందామని చెప్పి కాబోయే భర్తను పిలిచి అతి కిరాతకంగా కత్తితో దాడిచేసింది. ఈ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరుకు చెందిన రాము నాయుడికి అనకాపల్లి సమీపంలోని రావికమతం గ్రామానికి చెందిన పుష్ప అనే యువతితో పెళ్ళి నిశ్చయమయ్యింది. ఈ నెల 28న వీరి పెళ్ళి ముహూర్తం ఖరారు చేసారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే రాము పెళ్ళిపనుల కోసం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని ఏకాంతంగా కలుద్దామని యువతి కోరింది. ఆమె కోరిక మేరకు రావికమతం సమీపంలోని గుట్టలపైకి వెళ్లాడు. అక్కడ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా... కళ్ళు మూసుకోవాలని చెప్పడంతో యువకుడు అలాగే చేసాడు. ఒక్కసారిగా యువతి తనతో తెచ్చుకున్న కత్తితో కాబోయే భర్త గొంతుకోసింది. దీంతో రక్తపుమడుగులో పడిపోయిన రాము ఎలాగోలా కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి హాస్పిటల్ కు తరలించారు. ఇలా మృత్యువు అంచులదాక వెళ్లి వచ్చిన యువకుడు మెరుగైన వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.