విజయవాడలో విషాదం... ఆకతాయి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య
విజయవాడ: ఆకతాయి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. తనను వేధిస్తున్న యువకుడి పేరు పుస్తకంలో రాసిపెట్టి బాలిక బలవన్మరణానికి పాల్పడింది. భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్ లోని ఓ అపార్టమెంట్ పైనుండి దూకి బాలిక ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.