పోలీసుల్ని ఏకి పారేస్తున్న అమ్మాయి.. అసలేం జరిగిందంటే..
సామాన్యులకు ఆవేశం వస్తే వ్యవస్థలను కడిగిపారేస్తారు.. అదే చేస్తుందీ అమ్మాయి
సామాన్యులకు ఆవేశం వస్తే వ్యవస్థలను కడిగిపారేస్తారు.. అదే చేస్తుందీ అమ్మాయి. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల లాఠీ దెబ్బలకు ప్రాణాలు కోల్పోయిన ఏరిచర్ల కిరణ్ తోబుట్టువు ఈ అమ్మాయి. మాస్క్ పెట్టుకోలేదని అడిగిన పోలీసులకు, కిరణ్ కు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసి కిరణ్ చనిపోయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మాస్క్ పెట్టుకోకపోతే చెప్పాలి కానీ, కొట్టి చంపేస్తారా అంటూ పోలీసులు మీద తన ఆక్రోశాన్ని వెల్లగక్కుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.