ఓటమి భయంతోనే నాపై వైసీపీ దుష్ప్రచారం ... టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి
గడచిన మూడు సంవత్సరాలు కాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ నా మీద వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, వారి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మడం మానేసారని అన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
గడచిన మూడు సంవత్సరాలు కాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ నా మీద వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, వారి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మడం మానేసారని అన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. అయినా మళ్లీ తన మీద పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారానికి తెర తీశారని ఆయన వాపోయారు. స్థానికంగా చిలకలూరిపేట లోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా, వైసీపీలో చేరడానికి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళుతున్నట్టుగా ఒక కథనాన్ని యూట్యూబ్ ఛానల్ వేదికగా సృష్టించి నాపై మళ్ళీ అదే దుష్ప్రచారానికి తెర తీశారని, అడ్డగోలుగా యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి ఐప్యాక్ ద్వారా ఇదంతా సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు..!