గుంటూరు: కరెంట్ కోతలపై వాగ్వాదం... కర్రలతో తలలు పగలగొట్టుకున్న టిడిపి, వైసిపి వర్గాలు
గుంటూరు: కరెంట్ కోతల విషయంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మాటల యుద్దం ఘర్షణకు దారితీయడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరు: కరెంట్ కోతల విషయంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మాటల యుద్దం ఘర్షణకు దారితీయడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో నిన్న(బుధవారం) అర్ధరాత్రి ఇరుపార్టీల నాయకుల మధ్య కరెంట్ కోతల విషయం గొడవ జరిగింది. అస్తమానం కరెంట్ పోతోందంటూ ప్రభుత్వం, సీఎం జగన్ పై టిడిపి వర్గీయులు విమర్శలకు దిగారు. దీంతో ఆగ్రహించిన వైసిపి వర్గీయులు వారిపై దాడికి దిగారు. ఈ కరెంట్ కొట్లాటలో పదిమందికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఘర్షణలు జరక్కుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.