Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో మందుబాబుల హల్ చల్... ఎస్సైపై వైసిపి సర్పంచ్ అభ్యర్థి దాడి

తిరుపతి రూరల్ తిరుమల నగర్ లో మందు బాబుల హల్ చల్ చేశారు. 

First Published Feb 2, 2021, 10:13 AM IST | Last Updated Feb 2, 2021, 10:13 AM IST

తిరుపతి రూరల్ తిరుమల నగర్ లో మందు బాబుల హల్ చల్ చేశారు. తుడా మిగ్  3 మూడవ రోడ్డులో ఘటన ఏకంగా ఎక్స్ జ్ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఇలా పోలీసులపై దాడిచేసింది వైసిపి సర్పంచ్ అభ్యర్థి, అతడి అనుచరులేనని పోలీసులు ఆరోపిస్తున్నారు. నాటు సారా విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీ కోసం వెళ్లిన తమపై దాడికి పాల్పడ్డారని ఎక్సైజ్ ఎస్సై నాగరాజు పేర్కొన్నారు. అయితే తమ సిబ్బందిపై ఎలాంటి దాడి జరగలేదని... కేవలం తోపులాటే జరిగిందని అలిపిరి సీఐ దేవేంద్ర రెడ్డి అంటున్నారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది.