టిడ్కో ఇళ్ళకు వైసీపీ రంగు... నర్సీపట్నం లో బీజేపీ ఆందోళన
విశాఖపట్నం: నర్సీపట్నంలో నూతనంగా నిర్మితమౌతున్న టీడ్కో ఇళ్లకు వైసీపీ పార్టీ రంగులు వెయ్యడంపై నర్సీపట్నం బీజేపీ టౌన్ అధ్యక్షులు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.
విశాఖపట్నం: నర్సీపట్నంలో నూతనంగా నిర్మితమౌతున్న టీడ్కో ఇళ్లకు వైసీపీ పార్టీ రంగులు వెయ్యడంపై నర్సీపట్నం బీజేపీ టౌన్ అధ్యక్షులు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న టిడ్కో గృహాలకు వైసీపీ పార్టీ రంగులు వెయ్యడం ఏంటంటూ ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ రంగులు వేయకుండా నిలివెయ్యలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు, సీనియర్ నాయకులు గాదె శ్రీనివాసరావు, నాతవరం మండల బీజేపీ అధ్యక్షులు లాలం వెంకట రమణ, యువమోర్చా పృద్వి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.