వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లు దాఖలు

అమరావతి: శాసనసభ్యుల కోటాలో ఆరు శాసనమండలి సభ్యత్వాల కోసం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. 

First Published Mar 4, 2021, 6:57 PM IST | Last Updated Mar 4, 2021, 6:57 PM IST

అమరావతి: శాసనసభ్యుల కోటాలో ఆరు శాసనమండలి సభ్యత్వాల కోసం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు అందజేశారు. అహ్మద్ ఇక్బాల్‌, సి.రామ‌చంద్రయ్య‌, దువ్వాడ శ్రీ‌నివాస్‌, చ‌ల్లా భ‌గీర‌థ‌ రెడ్డి, క‌రీమున్నాసా, బ‌ల్లి క‌ల్యాణ‌ చ‌క్ర‌వర్తి నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, శాసనసభలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.