పవన్ కల్యాణ్ పక్కా తెలంగాణ వ్యతిరేకి..: పేర్ని నాని సంచలనం
మచిలీపట్నం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి విమర్శలు చేసారు.
మచిలీపట్నం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి విమర్శలు చేసారు. చంద్రబాబు వద్ద తీసుకున్న కూలీ డబ్బులకు న్యాయం చేసేందుకే సీఎం జగన్ పై పవన్ విషం చిమ్ముతున్నాడని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంనుండి తెలంగాణ విడిపోడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగానే కేసీఆర్ పార్టీ పెట్టారు... తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యిందని అన్నారు. జనాలు నవ్వుకున్నా సరే చంద్రబాబుకు మేలు చేసి జగన్ పై బురదజల్లేలా పవన్ ఏదో ఒకటి మాట్లాడతాడని అన్నారు.రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడుతనం వుండదంటూ పవన్ పై పేర్ని నాని మండిపడ్డారు.