Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ : గుంటూరు వైసిపిలో భగ్గుమన్న విబేధాలు

గుంటూరు : అధికార వైసిపికి చెందిన ప్రజాప్రతినిధుల మాటామటా పెరగడంతో గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. 

First Published Aug 17, 2023, 7:52 PM IST | Last Updated Aug 17, 2023, 7:52 PM IST

గుంటూరు : అధికార వైసిపికి చెందిన ప్రజాప్రతినిధుల మాటామటా పెరగడంతో గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సొంత పార్టీకే చెందిన మేయర్ మనోహర్ పై  స్థానిక ఎమ్మెల్యే  ముస్తఫా  తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. తన నియోజకవర్గ పరిధిలో నిధుల  కొరత కారణంగా పనులు జరగడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం  చేశారు. గతంలో ఎన్నోసార్లు కౌన్సిల్ లో వివాదం చేయడం వల్లే కొన్ని పనులయినా చేస్తున్నారని అన్నారు. కావాలనే తమ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారంటూ మేయర్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే. వైసిపి  కార్పొరేటర్లంతా ఎమ్మెల్యేకు మద్దతుగా నిలచారు. మేయర్ తో వాగ్వాదం తర్వాత ఎమ్మెల్యే ముస్తఫా కౌన్సిల్ సమావేశం నుండి వెళ్లిపోయారు.