ఆనందయ్య మందుతో ప్రభుత్వానికి, వైసిపికి సంబంధం లేదు..: ఎమ్మెల్యే కాకాని

ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ హెచ్చరించారు. 

First Published Jun 3, 2021, 10:02 AM IST | Last Updated Jun 3, 2021, 10:02 AM IST

ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ హెచ్చరించారు. ప్రజలు కూడా మందు కోసం దళారులను నమ్మి మోసపోకండని సూచించారు.  కరోనా పేషెంట్స్ కి అందించే ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదేనని అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి గానీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. వస్తురూపంలో ఇవ్వాలనుకునే, ఆర్థిక సహాయం అందించాలన్న వారు గానీ నేరుగా ఆనందయ్యకు తప్ప మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వవద్దని ఎమ్మెల్యే కాకాని మనవి చేశారు.