Asianet News TeluguAsianet News Telugu

వైసిపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం... రోడ్డెక్కిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు

విశాఖపట్టణం: రాజకీయాలకు అతీతంగా  ఉద్యమించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

First Published Feb 10, 2021, 3:52 PM IST | Last Updated Feb 10, 2021, 3:52 PM IST

విశాఖపట్టణం: రాజకీయాలకు అతీతంగా  ఉద్యమించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు స్టీల్ ప్లాంట్ టీడీఐ జంక్షన్ వద్ద ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కమ్యూనిష్టులతో కలిసి  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఈ ఆందోళనలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నేతలు, సిఐటియూ, ఐఎన్ టియూసి నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజు, గుడివాడ అమర్ నాద్, ఎంపి ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు.