Asianet News TeluguAsianet News Telugu

రసవత్తరంగా గన్నవరం పాలిటిక్స్... లోకేష్ తో యార్లగడ్డ బేటీ

గన్నవరం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.

First Published Aug 21, 2023, 6:34 PM IST | Last Updated Aug 21, 2023, 6:34 PM IST

గన్నవరం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైసిపిని వీడి టిడిపిలో చేరేందుకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ లోకేష్ ను కలిసారు. గన్నవరం నియోజవర్గం నిడమానురులో లోకేష్ బసచేసిన ప్రాంతానికి వచ్చి కలిసారు యార్లగడ్డ. ఇటీవల చంద్రబాబును కలిసిన యార్లగడ్డకు గన్నవరం టికెట్ హామీ లభించడంతో టిడిపిలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. రేపు గన్నవరంలో జరిగే లోకేష్ సభలోనే యార్లగడ్డ టిడిపిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తన చేరికపై చర్చించేందుకు లోకేష్ తో యార్లగడ్డ సమావేశమైనట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే లోకేష్ పాదయాత్రలో గన్నవరం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. పాదయాత్ర ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయం ముందుకు చేరుకోగానే జై టిడిపి, జై లోకేష్, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.