టిడిపి అభ్యర్థికి వైసిపి నాయకుడి బెదిరింపులు... ఫోన్ కాల్ లీక్
చిత్తూరు: పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజే అధికార పార్టీ దౌర్జన్యాలు కూడా ప్రారంభమయ్యాయని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు: పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజే అధికార పార్టీ దౌర్జన్యాలు కూడా ప్రారంభమయ్యాయని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సిఎం నారాయణ స్వామి నియోజకవర్గ పరిధిలో టిడిపి తరపున నామినేషన్ వేయడానికి సిద్దపడ్డ ఓ అభ్యర్థి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. బెందిరింపు ఫోన్ కాల్ రికార్డింగ్ ను కూడా బయటపెట్టాడు.
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఆర్కేవిబి పేట గ్రామానికి చెందిన సాంబశివ ఆచారి తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్దమయ్యాడు. దీంతో అధికార వైసిపి అభ్యర్థి భర్త దుష్యంత్ కుమార్ తనను పోటీ నుండి తప్పుకోవాలని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. గత రాత్రి వైసీపీ నాయకుడు దుష్యంత్ తన సోదరుడు రాధాకృష్ణ ఆచారికి ఫోన్ చేసి ''మీ అన్న నామినేషన్ వేస్తే చంపేస్తాం'' అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని సాంబశివ ఆచారి ఆరోపించారు.